టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, హాలీవుడ్ అయినా హీరోల రెమ్యూనరేషన్ తో చాలామంది హీరోయిన్లు పోటీపడలేకపోతున్నారు. కానీ, కొందరు మాత్రం అందుకు భిన్నం. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్లు అందుకుంటున్నారు. ఇలా అత్యధిక పారితోషకం అందుకున్న నాయికల జాబితాను ఫోర్బ్ మేగజైన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ రేటెడ్ హీరో్యిన్లెవరో చెప్పింది. అందులో మన బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దీపికా పడుకునే పదో స్థానంలో నిలిచింది.
నీల్సన్, బాక్సాఫీస్ మోజో, ఐఎండీబీ, మేనేజర్లు, లాయర్లు, పలు సందర్భాల్లో ఈ నాయికలు ఇచ్చిన ఇంటర్వూల ఆధారంగా ఫోర్బ్ వీళ్ల రెమ్యునరేషన్‌ను అంచనా వేసింది. ఒక్క సినిమాలతోనే కాదు వివిధ వ్యాపార ప్రకటనల ఒప్పందాలతో ఈ మొత్తాన్ని ఆర్జిస్తున్నారు. అత్యధికంగా సంపాదిస్తున్న నాయికల్లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే పదో స్థానంలో నిలిచింది.
ఫోర్బ్సు జాబితాలో మొదటి స్థానం జెన్నిఫర్ లారెన్స్ అందుకుంది. ఎక్స్ మెన్ సిరీస్ చిత్రాల సుందరి జెన్నిఫర్ లారెన్స్ ప్రపంచంలో ఖరీదైన నాయికగా ఫోర్బ్ ప్రకటించింది. జెన్నిఫర్ నటించిన ఇటీవల చిత్రాలు 5 బిలియన్ డాలర్ల బాక్సాఫీస్ వసూళ్లు సాధించాయి. జెన్నిఫర్ ఏడాది సంపాదన 46 మిలియన్ డాలర్లు అంటే 312 కోట్ల రూపాయల పైనే.
ఏడాదికి 223 కోట్ల రూపాయల ఆదాయంతో రెండో స్థానంలో నిలిచింది మెలిసా మెకార్తీ. ఘోస్ట్ బస్టర్స్ సినిమాతో మెలిసా హాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది. ఘోస్ట్ అండ్ షెల్ చిత్రానికి 17.5 మిలియన్ డాలర్ల రెమ్యునరేషన్ తీసుకుని హాలీవుడ్‌ను ఆశ్చర్యపరిచింది స్కార్లెట్ జోహాన్‌సన్. ఈ తార మొత్తం ఏడాది సంపాదన 25 మిలియన్ డాలర్లు అంటే…170 కోట్ల రూపాయలు. భారీ చిత్రాల్లో తారగా నటించడంతో పాటు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్, స్మార్ట్ వాటర్, ఎవినో, లివింగ్ ఫ్రూవ్ షిల్స్ లాంటి ప్రకటనలతో అత్యధికంగా ఆర్జిస్తున్న భామల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది జెన్నిఫర్ అనిస్టన్. 142 కోట్ల రూపాయల ఏడాదికి జెన్నిఫర్ ఆర్జిస్తోంది.
కాగా ఫోర్బ్ ప్రకటించిన నాయికల్లో ఇండియా నుంచి ఒక్క దీపికా పడుకునేకు మాత్రమే చోటు దొరికింది. వీరితో పాటు ఒక చైనీస్ బ్యూటీ కూడా ఉంది. ఆ చైనీస్ గ్లామర్ డాల్ పేరు ఫ్యాన్ బింగ్‌బింగ్. స్కిప్‌ట్రేస్, లేడీ ఆఫ్ ద డైనాస్టీ చిత్రాలతో బింగ్‌బింగ్ హాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది. 115 కోట్ల రూపాయల ఆదాయంతో ఐదో ఖరీదైన తారగా మారింది. ఆరో స్థానంలో నిలచింది ఛార్లైజ్ థెరాన్. హంట్స్ మన్ వింటర్ వార్, మ్యాడ్ మ్యాక్స్ చిత్రాల్లో నటించిన ఈ నాయిక…సంపాదన 16.5 మిలియన్ డాలర్లు(111 కోట్ల రూపాయలు)సంపాదిస్తోంది. వార్నర్ బ్రదర్స్ డీసీ కామిక్ సిరీస్ లో నటించిన అమీ ఆడమ్స్…13.5 మిలియన్ డాలర్లు భారతీయ కరెన్సీలో 91 కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. 12 మిలియన్ డాలర్లు(81 కోట్ల రూపాయలు) ఆదాయంతో జూలియా రాబర్ట్ , 11 మిలియన్ డాలర్లతో (74 కోట్ల రూపాయలు ) మిలా కునీస్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక పదో స్థానం దక్కించుకున్న బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే 10 మిలియన్ డాలర్లు ( 67 కోట్ల రూపాయలు)ఆర్జిస్తోంది. వెండితెరతో పాటు దాదాపు పన్నెండు వాణిజ్య ప్రకటనల ఒప్పందాలతో దీపికా ఇంత సంపాదిస్తోందట. - See more at;telugumovieznews.blogspot.in
ConversionConversion EmoticonEmoticon